Renigunta: రేణిగుంటలో నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన!
Renigunta: వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా రేణిగుంట సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో అధికారులు కరకంబాడి చెరువును పరిశీలించారు.
Renigunta: రేణిగుంటలో నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన!
Renigunta: వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర రెవెన్యూ,పంచాయతీ అధికారులు కలిసి కరకంబాడి గ్రామంలోని చెరువును సందర్శించారు.
వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, రాకపోకల నియంత్రణ తదితర అంశాలను సీఐ పరిశీలించారు. నిమజ్జన సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
పోలీస్,రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story




