Renigunta: రేణిగుంటలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్, ప్రజలకు అవగాహన

Renigunta: రేణిగుంటలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐ జయచంద్ర. బస్ స్టేషన్‌లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించిన పోలీసులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 19 July 2026 9:24 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్, ప్రజలకు అవగాహన

రేణిగుంట: శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ లక్ష్యంగా రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులకు రేణిగుంట సీఐ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సమాజంలో బాధ్యతాయుతంగా మెలిగి, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. పోలీసులు చేపడుతున్న నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

మహిళల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన

రేణిగుంట ఆర్టీసీ బస్ స్టేషన్‌లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, మొబైల్ ఫోన్ చోరీల నివారణపై రేణిగుంట పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికులు, ప్రజలకు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. మహిళల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.అలాగే మొబైల్ ఫోన్ చోరీలు జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story