Renigunta: రేణిగుంట గంగమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు డీఎస్పీ శ్రీనివాస్ రావు!

Renigunta: ఈ నెల 17, 18, 19 తేదీల్లో రేణిగుంట గంగమ్మ జాతర. భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఎమ్మార్వో, ఎంపీడీవో, డీఎస్పీ శ్రీనివాస్ రావు ప్రత్యేక సమీక్ష.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 13 Aug 2026 1:29 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట గంగమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు డీఎస్పీ శ్రీనివాస్ రావు!

Renigunta: రేణిగుంటలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్న గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనిరేణిగుంట dsp శ్రీనివాస్ రావు అధికారులు సూచించారు.

రేణిగుంట గంగమ్మ ఆలయ ప్రాంగణంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్, కార్ యూనియన్ ప్రతినిధులు, ఆలయ కార్యనిర్వాహకులు, వ్యాపారులు, ఇతర సంబంధిత వర్గాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సూచనలు ఇచ్చారు.

జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహనాలను క్రమబద్ధంగా నిలిపేలా సహకరించాలని ఆటో, కార్ డ్రైవర్లకు సూచించారు. రహదారులపై అనవసరంగా వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవద్దని కోరారు.

అలాగే వ్యాపారులు కూడా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా దుకాణాలను క్రమబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

జాతర సందర్భంగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రజలు, భక్తులు, వ్యాపారులు, వాహనదారులు పోలీసులకు మరియు అధికారులకు సహకరించి జాతరను విజయవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

అందరి సహకారంతో గంగమ్మ జాతరను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించి రేణిగుంటకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు ఆకాంక్షించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story