Renigunta: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన విమానాల రాకపోకలు!
Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో రోజుకు 9 విమానాలకు తగ్గిన రాకపోకలు. ప్రయాణికులు లేక తీవ్రంగా దెబ్బతిన్న టాక్సీ డ్రైవర్ల జీవనోపాధి.. సర్వీసులు పెంచాలని వినతి.
Renigunta: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన విమానాల రాకపోకలు!
Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో గత రెండు నెలలుగా రోజుకు సుమారు 9 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు రోజుకు సుమారు 17 విమానాలు రాకపోకలు సాగించేవని తెలుస్తోంది. విమానాల సంఖ్యలో వచ్చిన మార్పు విమానాశ్రయంపై ఆధారపడిన టాక్సీ డ్రైవర్లపై ప్రభావం చూపుతోంది.
విమానాల రాకపోకలు తగ్గడంతో ప్రయాణికుల సంఖ్య కూడా కొంత మేర తగ్గిందని టాక్సీ డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో తమకు లభించే ట్రిప్పుల సంఖ్య తగ్గి,ఆదాయంపై ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు.
విమానాల రాకపోకల్లో మార్పులకు గల కారణాలను సంబంధిత అధికారులు పరిశీలించి, ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా విమాన సర్వీసుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టాక్సీ డ్రైవర్లు కోరుతున్నారు.




