Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్!
Renigunta: రేణిగుంట పిఎస్‌లో రౌడీషీటర్లు, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ జయచంద్ర. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలని హెచ్చరిక.
Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్!
రేణిగుంట: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సీఐ ఎస్. జయచంద్ర పాల్గొని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఐ జయచంద్ర, సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాలని, మంచి పౌరులుగా జీవించాలని వారికి సూచించారు. నేరాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ సక్రమ జీవనం కొనసాగించాలని అవగాహన కల్పించారు.
రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Next Story




