Renigunta: రేణిగుంటలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ నిబంధనలు మీరితే కఠిన చర్యలని సీఐ హెచ్చరిక

Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లు, అనుమానితులకు సీఐ జయచంద్ర కౌన్సెలింగ్. నేరాలకు దూరంగా ఉండి, శాంతిభద్రతలకు సహకరించాలని ఆదేశం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 July 2026 5:44 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ నిబంధనలు మీరితే కఠిన చర్యలని సీఐ హెచ్చరిక

రేణిగుంట: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులకు సీఐ జయచంద్ర కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రేణిగుంట సీఐ జయచంద్ర మాట్లాడుతూ, నేరాలకు దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ కుటుంబ సభ్యుల గౌరవాన్ని నిలబెట్టేలా మంచి ప్రవర్తనతో జీవించాలని సూచించారు.అంతేకాకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

నేరాలకు దూరంగా ఉండి సమాజంలో ఆదర్శంగా నిలవాలని రౌడీ షీటర్లు, అనుమానితులకు సీఐ జయచంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story