Rayachoty: పాల ఏకిలి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా శివప్రసాద్
Rayachoty: రాయచోటిలో పాల ఏకిలి నాయకులతో టిడిపి బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ నాయుడు భేటీ. సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి హామీ.
Rayachoty: పాల ఏకిలి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా శివప్రసాద్
రాయచోటి: పట్టణంలోని భాను హరి రెసిడెన్సీలో ఉన్న తన కార్యాలయంలో టిడిపి బీసీ సాధికార సమితి రాష్ట్ర పాల ఏకరి కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (గుట్ట బాబు) గారిని గాండ్లపెంట మండలానికి చెందిన పాల ఏకరి సామాజిక వర్గ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి పలు స్థానిక సమస్యలు, సామాజిక వర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా గాండ్లపెంట మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి శాశ్వత పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని టిడిపి బీసీ సాధికార సమితి రాష్ట్ర పాల ఏకరి కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (గుట్ట బాబు) హామీ ఇచ్చారు.
అలాగే పాల ఏకరి సామాజిక వర్గ ఐక్యత, సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాండ్లపెంట మండల పాల ఏకరి వైస్ కన్వీనర్ వై. శంకర్ నాయుడు, మాజీ సర్పంచ్ కాల్వపల్లె శ్రీహరి నాయుడు, కాల్వపల్లె వెంకట నరసప్ప నాయుడు, ముక్కం కదిరిపతి నాయుడు, రాగినేని శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.




