Puttur: పుత్తూరులో 11 కిలోల గంజాయి స్వాధీనం, ఆరుగురు అరెస్ట్
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు.
Puttur: పుత్తూరులో 11 కిలోల గంజాయి స్వాధీనం, ఆరుగురు అరెస్ట్
తిరుపతి జిల్లా,పుత్తూరు....
పుత్తూరులో 11 కిలోల గంజాయి పట్టివేత...
ఆరుగురు నిందితులు అరెస్ట్... మరో ఇద్దరు పరార్...
పోలీసులు మెరుపు దాడిలో 11 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం..
పుత్తూరు మండలం టి.ఆర్. కండ్రిగ చెరువు సమీపంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడిలో సుమారు రూ.1.67 లక్షల విలువైన 11 కిలోల గంజాయి స్వాధీనం...
పరార్ లో ఉన్న మరో ఇద్దరు నిందితులు రాజేశ్ ఆర్‌కే, శ్రీనివాసుల కోసం ముమ్మరంగా గాలింపు...
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఎస్‌డీపీఓ జి. రవికుమార్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ డి. నెట్టికంటయ్య ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఎస్‌ఐలు నాగేంద్ర యాదవ్ , వెంకటలక్ష్మి, హెడ్ కానిస్టేబుళ్లు అర్జున్, విలియమ్స్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని డీస్పీ రవికుమార్ తెలిపారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




