Tirupati: పేరూరులో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి!
Tirupati: తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో '2 ఏళ్ల అభివృద్ధి... నమ్మకం... సంక్షేమం' ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది.
Tirupati: పేరూరులో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి!
Tirupati: తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో "2 ఏళ్ల అభివృద్ధి... నమ్మకం... సంక్షేమం" ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమం 9వ రోజుకు విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా పేరూరు పంచాయతీకి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కి స్థానిక నాయకులు, కార్యకర్తలు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
అనంతరం పంచాయతీలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్న తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని వారి వినతులను శ్రద్ధగా ఆలకించారు.
ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేరూరు పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నారని తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ పేరూరు పంచాయతీ రూపురేఖలను మార్చే దిశగా ముందుకు సాగుతున్నారని అన్నారు.
పంచాయతీలు ఇప్పటిదాకా 48 పనులకు 1కోటి 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అని తెలిపిన పులివర్తి సుధా రెడ్డి. పంచాయతీలోని వివిధ సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకురాగా, వాటిని ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటానని శ్రీమతి పులివర్తి సుధా రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




