Pellakuru: పెళ్లకూరు తాసిల్దార్ ఆఫీస్‌లో నేల పైనే ఉద్యోగుల విధులు
Pellakuru: పెళ్లకూరు తాసిల్దార్ కార్యాలయంలో తీవ్ర మౌలిక వసతుల కొరత. శిథిలావస్థకు చేరిన భవనం.. పక్క భవనంలో నేలపైనే ఉద్యోగుల పని, పాముల భయంతో ప్రజల ఆందోళన.
Pellakuru: పెళ్లకూరు తాసిల్దార్ ఆఫీస్‌లో నేల పైనే ఉద్యోగుల విధులు
పెళ్ళాకూరు: తిరుపతి జిల్లా పెళ్ళాకూరు మండలం తాసిల్దార్ కార్యాలయంలో అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు నేల మీద పనిచేయడం ఆనవాయితీగా మారిపోయింది. తాసిల్దార్ కార్యాలయం ఎప్పుడో కట్టింది కావడంతో ఆ భవనంలో పెచ్చులు ఊడడం కనీసం సిబ్బంది కూర్చునే దానికి సరైన గది కూడా లేకపోవడం తో అక్కడికి ఎంతమంది తాసిల్దార్లు బదిలీ అయి వచ్చిన పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ భవనాన్ని తాసిల్దారు కార్యాలయంగా వాడుకుంటూ ఉండటంతో సిబ్బంది నేల మీద పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది.
మండలంలోని ప్రజలు నాయకులు పలుమార్లు ఉన్నతాధికారులకు తెలియజేసిన తాసిల్దార్ భవనాన్ని గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ భవనం శిథిలావస్థలోకి కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తుంది, ఇలాంటి భవనంలో కనీసం కుర్చీలలో కూర్చోవడానికి కూడా వీలు లేక పక్క భవనంలో నేల మీదే ఉద్యోగస్తులు పనిచేయడం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
పెళ్ళాకూరు మండల తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో కనీసం వారి కనీస సౌకర్యాలు కూడా పట్టించుకోకుండా అక్కడే ఇబ్బందులు పడుతూ ఉద్యోగాన్ని చేస్తుండడాన్ని అక్కడి ప్రజలు గమనిస్తున్నారు.
తాసిల్దార్ కార్యాలయంలో అప్పుడప్పుడు పాములు కనిపించడం అక్కడే అవి తిరుగుతుండడం ఆనవాయితీగా మారిందని తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న ఆ మండల ప్రజలు తెలియజేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, శిధిలావస్థకు చేరుకున్న భవనాన్ని ఇకనైనా కూల్చివేసి కొత్త భవనం నిర్మించే విధంగా ఉన్నతాధికారులు మరియు నాయకులు చర్యలు తీసుకోవాలని పెళ్లకూరు మండల ప్రజలు కోరుకుంటున్నారు.
ఇప్పటికే పెళ్ళాకూరు మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏదైనా పనిమీద వెళ్లిన ప్రజలు ఆ భవనం లోపలికి వెళ్లే దానికి భయపడి చెట్లు కిందే కూర్చొని అధికారులను చెట్లు కిందే కలిసి వారి సమస్యని తెలియజేసి వెళుతుండడం ఆనవాయితీగా మారిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు.




