Tiruchanur: తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెప్పలపై శ్రీ కృష్ణస్వామి వారి విహార విశేషాలు ఇక్కడ చూడండి.
Tiruchanur: తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు!
తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా ఒకటవ రోజైన గురువారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పల పై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు.
మధ్యాహ్నం స్వామివారి ముఖమండపంలో స్వామివారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తెప్పల పై కొలువుదీర్చారు. అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పల పై మూడు పర్యాయాలు విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో హరింధ్రనాథ్, ఏవిఎస్వో రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, మునస్వామి, అర్చకులు బాబు స్వామి, వేంపల్లి శ్రీనివాసులు స్వామి, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




