Tirupati: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు!
Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 18 వరకు పెంపు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడి.
Tirupati: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు!
Tirupati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఎన్టీఆర్ భరోసా' నూతన పింఛన్ల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 18వ తేదీ వరకు పొడిగించినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. గతంలో సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు నిర్ణయించిన ఈ గడువును, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం మరో రెండు రోజులు పెంచిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్లు అందుతుండగా, కొత్తగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దీనికోసం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ఆన్‌లైన్‌లో నమోదు పూర్తయిన వెంటనే అక్నాలెడ్జ్‌మెంట్ పత్రం అందజేస్తారని వివరించారు.
ఈ అవకాశాన్ని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ఏ ఒక్కరూ పింఛనుకు దూరం కాకుండా వెంటనే సంబంధిత కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.




