Tirupati: లైట్ లేదు.. భద్రత లేదు.. ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ప్రజల ఆవేదన

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంట ఎన్టీఆర్ విగ్రహం కూడలి సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో లైటింగ్ లేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 15 May 2026 9:41 PM IST
Tirupati
X

Tirupati: లైట్ లేదు.. భద్రత లేదు.. ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ప్రజల ఆవేదన

తిరుపతి జిల్లా: రేణిగుంట ఎన్టీఆర్ విగ్రహం కూడలి సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో సరైన లైటింగ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తర్వాత ఏటీఎం పూర్తిగా చీకట్లో మగ్గిపోవడంతో నగదు ఉపసంహరణకు వచ్చే వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.ఏటీఎం కేంద్రంలో వెలుతురు లేకపోవడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రాత్రి సమయంలో నగదు తీసుకోవడానికి భయపడుతున్నట్లు తెలిపారు.సంబంధిత బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి లైటింగ్ సదుపాయం కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story