Naidupeta: మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులకు జైలు, ఫైన్ తప్పదు ఎస్సై!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులకు జరిమానాతో పాటు శిక్షలు తప్పవని ఎస్సై శివ శంకర్ రావు హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Aug 2026 7:11 PM IST
Naidupeta
X

Naidupeta: మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులకు జైలు, ఫైన్ తప్పదు ఎస్సై!

నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేటలో బజారు వీధులలో మరియు నాయుడుపేట మెయిన్ రోడ్లలో మైనర్లు బైకులు నడుపుతుండడం విరివిగా జరుగుతుందని పలుమార్లు ఇలాంటి మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన మైనర్లు బైకులు నడపడం కొనసాగుతుందని ఇలా మైనర్లు బైకులు నడిపితే వారి తల్లిదండ్రులకు ఫైన్ విధించడంతోపాటు శిక్షలు కూడా అమలు చేయాల్సి ఉంటుందని అందువలన మైనర్లకు బైకులు నడపడానికి ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని ఎస్సై శివ శంకరా రావు తెలియజేశారు,

అలాగే కొంతమంది ఆకతాయిలు బుల్లెట్ బైక్లలో పెద్ద శబ్దం వచ్చే విధంగా బజారు వీధులలో ఫాస్ట్ రైడింగ్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుందని అలాంటి వారిని కూడా నాయుడుపేట పోలీస్ హెచ్చరించడం జరుగుతుందని ఇలాగ పెద్ద శబ్దం వచ్చే విధంగా బైకులు వేగంగా నడిపితే కచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ రూల్స్ ను ఎవరు అతిక్రమించిన సహించేది లేదని యువత, ఈ మైనర్ లు బైకుల పట్ల జాగ్రత్త వహించాలని.

ప్రమాదాలకు గురై అంగవైకల్యం మరియు ప్రాణాలు పోయే విధంగా బైకులు నడపాల్సిన అవసరం లేదని ముఖ్యంగా ఇలాంటి వారిపై తల్లిదండ్రులు జాగ్రత్త వహించి బైకులను వారికి అందుబాటులో లేని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని యువత, మైనర్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే నాయుడుపేట అర్బన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వాటి ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై శివశంకర్ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story