Naidupeta: డాక్టర్ వి.పి. కుమార్ రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి నివాళులు

Naidupeta: నాయుడుపేటలో డాక్టర్ వి.పి. కుమార్ రెడ్డి ఉత్తర క్రియలు. హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి.

KKV Sudhakar, Sullurupeta
Published on: 22 July 2026 8:49 PM IST
Naidupeta
X

Naidupeta: డాక్టర్ వి.పి. కుమార్ రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి నివాళులు

నాయుడుపేట: ప్రముఖ రాజకీయ నాయకులు డాక్టర్ వి.పి. కుమార్ రెడ్డి అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో, బుధవారం తిరుపతిజిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆయన నివాసంలో నిర్వహించిన ఉత్తర క్రియల కార్యక్రమంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసిపి నాయకులు నల్లపురెడ్డి జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

​అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వైసిపి రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, నాయుడుపేట ఏ.ఎం.సీ మాజీ ఛైర్మెన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మద్దాలి సోమశేఖర్ రెడ్డి

నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షులు ఓట్టూరు కిషోర్ యాదవ్, ఓజిలి మండల పార్టీ అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి, దొరవారిసత్రం మండల పార్టీ అధ్యక్షులు అల్లూరు రాహుల్ రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కట్టా భవాని శంకర్ రెడ్డి, మాజీ నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకట కృష్ణారెడ్డి, వైసిపి మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఈదా రత్నశ్రీ, నాయుడుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పేర్నాటి రాహుల్,

వైసీపీ నాయకులు బైనా మల్లికార్జున్ రెడ్డి, పేట చంద్ర రెడ్డి, వైసిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు భావన్ అనుదీప్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు పాలేటి నాగార్జున, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షబ్బీర్, మహిళా విభాగం నాయకురాలు కన్మణి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు అనుబంధ విభాగాల నాయకులు హాజరై డాక్టర్ వి.పి. కుమార్ రెడ్డికి నివాళులర్పించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story