Naidupeta: నాయుడుపేటలో ఘనంగా 'బామ్సెఫ్' క్లస్టర్ కన్వెన్షన్ - 2026!
Naidupeta: నాయుడుపేటలో బామ్సెఫ్ (BAMCEF) క్లస్టర్ కన్వెన్షన్ - 2026 ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ శ్రీపతి బాబు, ప్రముఖులు హాజరయ్యారు.
Naidupeta: నాయుడుపేటలో ఘనంగా 'బామ్సెఫ్' క్లస్టర్ కన్వెన్షన్ - 2026!
తిరుపతి జిల్లా: నాయుడుపేట లని ఎంకే ఫంక్షన్ హాల్ లో BAMCEF క్లస్టర్ కన్వెన్షన్ - 2026 సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ శ్రీపతి బాబు, ప్రముఖ న్యాయవాది గంగా ప్రసాద్, విశ్రాంత మరియు ప్రస్తుత ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గురవయ్య, బందిలి మోహన్, మురళి మరియు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు BAMCEF సభ్యులు ప్రజలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా పలువురు BAMCEF గురించి మాట్లాడుతూ ఈ BAMCEF సంస్థ ఏ ఒక్క కులానికి చెందినది కాదని ఈ సంస్థలో అనేక కులాల వారు సభ్యులుగా ఉన్నారని గతంలో అనేక అగ్రవర్ణాల సంస్థలలో సభ్యత్వం వారికే ఉండేదని అప్పుడు పుట్టుకు వచ్చింది ఈ సంస్థన ఇందులో అనేక రకాల కు సంబంధించిన కులాలు దేశం మొత్తం సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా వాళ్లు తెలియజేయడం జరిగింది,
ఈ కార్యక్రమం నాయుడుపేటలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం BAMCEF కు సంబంధించి అనేక మంది సభ్యులు ఇక్కడ ఉన్నారని అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన స్పందన సంతోషించదగిన విషయమని ఈ సమస్త దేశంలో నేడు వెనుకబడిన మరియు మైనారిటీ కులాల కు సంబంధించిన ఉద్యోగులకు భరోసానిస్తూ ఉద్యోగం సమయంలో ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు ఈ సంస్థ అండగా ఉంటూ ఎటువంటి అన్యాయాలకు ప్రభుత్వ ఉద్యోగులు గురికాకుండా ఈ సంస్థ అండగా ఉంటుందని అలాగే దేశంలోని పేద ప్రజలకు అనేక సమస్యల్లో ఈ సంస్థ అండగా ఉంటూ వారికి న్యాయం చేయడం కూడా జరుగుతుందని అందువల్ల దీనిని రూపకల్పన చేసిన మహానుభావులకు ఎప్పుడు రుణపడి ఉండాలని ఈ సందర్భంగా పలువురు తెలియజేశారు,




