Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం
Naidupeta: నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం. మార్కెట్ అభివృద్ధి పనులు, కొత్తగా రైతు బజార్ల ఏర్పాటుపై కీలక చర్చ.
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశానికి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, వైస్ చైర్మన్ గోపి కమిటీ సభ్యులు పాల్గొన్నారు, ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు చర్చించడం జరిగింది, ప్రభుత్వం నుండి నిధులను మంజూరు కావలసి ఉందని ఈ నిధులు మంజూరు అవ్వగానే వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని వ్యవసాయ కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది,
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేస్తూ ఏప్రిల్ మే జూన్ నెలల ఆదాయ వనరుల నుండి రైతు బజార్లను ఏర్పాటు చేసే విధంగా ఈ సమావేశంలో సభ్యులతో చర్చించడం జరుగుతుందని ప్రజలకు రైతు బజార్ల రూపంలో రైతుల నుండి నేరుగా కూరగాయలను పువ్వులను పండ్లను ప్రజలు కొనుగోలు చేసినట్లయితే అటు రైతులకు ఇటు ప్రజలకు ఆదాయం చేకూరే విధంగా ఉంటుందని అందుకే ఈ రైతు బజార్లను ఏర్పాటు చేసే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చర్యలు తీసుకుంటుందని కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు.




