Naidupet: నాయుడుపేటలో ‘స్వర్ణముఖి కథలు’ పుస్తకావిష్కరణ

Naidupet: నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘స్వర్ణముఖి కథలు’ పుస్తకావిష్కరణ. ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న లత చేతులమీదుగా ఆవిష్కరణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Aug 2026 6:06 PM IST
Naidupet
X

Naidupet: నాయుడుపేటలో ‘స్వర్ణముఖి కథలు’ పుస్తకావిష్కరణ

నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణముఖి కథలు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న లత, ఈ కార్యక్రమంలో ప్రపంచ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రచయిత డాక్టర్ వి ఆర్ రాసాని రాసిన స్వర్ణముఖి కథలు పుస్తక ఆవిష్కరణ నాయుడుపేటలో జరగడం సంతోషకర విషయం అని ఎందుకంటే స్వర్ణముఖి కథలు పుస్తకం స్వర్ణముఖి నదిని తెలియపరుస్తూ రాసిన పుస్తకం అని అలాంటి పుస్తకం నాయుడుపేటలో ఆవిష్కరించడం స్వర్ణముఖి నదికి ఇచ్చిన గౌరవంగా మేము అనుకుంటున్నామని నాయుడుపేట స్వర్ణముఖి నదిని ఆనుకొని ఉంటుందని దానివల్ల మేము రాసిన పుస్తకం నాయుడుపేటకు కూడా సంబంధించి ఉంటుందని తెలియజేశారు.

స్వర్ణముఖి నది ఎక్కడ పుట్టింది, అక్కడ నుండి ఎక్కడకు ప్రయాణిస్తుంది, మధ్యలో ఎన్ని ప్రదేశాలను కలుపుతూ ఈ నది సముద్రం కలుస్తుంది, ఎంతమంది రైతులకు ఈ స్వర్ణముఖి నది ఆధారంగా ఉంది అనే అన్ని అంశాలపై ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని వారు తెలియపరిచారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story