Naidupet: జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
Naidupet: నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తనిఖీ చేశారు. మౌలిక వసతులు, భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో భోజనం చేశారు.
Naidupet: జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయ్ శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు సిబ్బంది తోపాటు విద్యార్థులని స్కూల్లో మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు, ప్రభుత్వం అందిస్తున్న సమ దుస్తులు పుస్తకాలు వివరాలు పరిశీలించారు స్కూల్ ప్రాంగణంలో శుభ్రత పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని తెలియజేశారు, పాఠశాలలో ఏర్పాటుచేసిన భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విజయశ్రీ అనంతరం విద్యార్థినీలతో కలిసి పాఠశాలలోనే భోజనం చేశారు, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులు వారి స్థితిగతులను దాటి ఉన్నత శిఖరాలను చేరుకునే వాళ్ళని ఆకాంక్షతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచుతూ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో నాయుడుపేట టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు 786 రఫీ , టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్, శ్రీ పోలేరమ్మ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సుబ్బారావు, క్లస్టర్ ఇంచార్జ్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ చిట్టిటి రేవతి, టౌన్ BC సెల్ అధ్యక్షులు ఇమ్మడి శెట్టి వెంకటేశ్వర్లు, హాస్పిటల్ కమిటీ సభ్యులు GVR నాయుడు, పార్టీ నాయకులు జువ్వలపాటి మస్తాన్, పలుకూరు ముత్యాలయ్య, రమాదేవి, సునీతమ్మ లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.




