Nagari: ఇందిరానగర్‌లో మురుగు కాలువలు శుభ్రం చేయాలి సీపీఐ
Nagari: నగరి 11వ వార్డు ఇందిరానగర్‌లో పూడికపడిన డ్రైనేజీలను సీపీఐ బృందం పరిశీలించింది. 5 రోజుల్లో సమస్య తీర్చకపోతే మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి హెచ్చరిక.
Nagari: ఇందిరానగర్‌లో మురుగు కాలువలు శుభ్రం చేయాలి సీపీఐ
నగరి: నగరి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ఇందిరానగర్‌లో డ్రైనేజీ కాలువలు పూర్తిగా మట్టితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు. కాలువలను వెంటనే శుభ్రం చేసి ప్రజలను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలని మున్సిపల్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
గురువారం సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్ ఆధ్వర్యంలో పార్టీ బృందం ఇందిరానగర్‌లోని సుమారు 500 మీటర్ల పొడవైన డ్రైనేజీ కాలువను పరిశీలించింది. కాలువ పూర్తిగా మట్టితో నిండిపోవడంతో మురుగునీరు సరిగా వెళ్లక ఇళ్లలోకి చేరుతోందని, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రత్యేక సిబ్బందితో కాలువలను శుభ్రం చేయించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే వార్డు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు.
ఐదు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో వార్డు ప్రజలను సమీకరించి నగరి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్, నాయకులు భాషా, షిరవుద్దీన్,వార్డు నాయకులు ఫజిల్, మహమ్మద్, ఆయేషా, ఫాతిమా, బర్కత్‌నిషా, సేటు తదితరులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.




