Naidupeta: సర్వసభ్య సమావేశంలో రచ్చ అధికారుల గైర్హాజరీపై ఆగ్రహం!
Naidupeta: ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పారిశుధ్య లోపం, గుంతల రోడ్లు, గృహ నిర్మాణాల సమస్యలపై ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు.
Naidupeta: సర్వసభ్య సమావేశంలో రచ్చ అధికారుల గైర్హాజరీపై ఆగ్రహం!
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లని ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధనలక్ష్మి తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ, మండలాధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు, నాయుడుపేట మండలంలోని పలు పంచాయతీలలో అపరిశుభ్రత పరిస్థితులు కనిపిస్తున్నాయని స్వచ్ఛభారత్, పచ్చదనం, పచ్చ తోరణం వంటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఇంకా అపరిశుభ్రత పరిస్థితులు కనిపిస్తుండడం బాధాకర విషయం అని పలువురు ఎంపీటీసీలు తెలియజేశారు, పంచాయతీలలో రోడ్ల కొరత కొనసాగుతుందని కొన్ని రోడ్లు అయితే ప్రయాణానికి వీలు లేకుండా గుంతలు మయంగా తయారయ్యాయని వాటిని పట్టించుకునే పరిస్థితులలో నాయకులు అధికారులు లేరని ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుందని కొంతమంది ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో గృహ నిర్మాణ కొరత ఎక్కువగా ఉందని సామాన్య ప్రజలు ఇంకా సొంతిల్లు నిర్మించుకోవడం కలగానే ఉంటుందని ప్రభుత్వం దీనిని గుర్తించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఇప్పటికే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ దరఖాస్తులు తీసుకొని సొంత ఇంటి కోసం తిరుగుతూ ఉన్నారని అందువల్ల ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ గృహ నిర్మాణాలను త్వరగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేయడం జరిగింది.
అయితే ఈ సర్వసభ్య సమావేశంలో అధికారులు అందరూ పాల్గొనక పోవడం ప్రజా సమస్యలు పంచాయితీల అభివృద్ధి మరియు ప్రభుత్వ నిధుల వినియోగం వీటిపై చర్చించే విధంగా ఎవరూ లేకపోవడంపై ప్రజలలో ఈ సమావేశాల పట్ల అసహనం వ్యక్తం అవుతున్నట్టు కూడా కొంతమంది సామాన్య ప్రజలు చర్చించుకోవడం జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ప్రజల మాటలకు నాయకులు అధికారులు ప్రజా సమస్యలను తీర్చడం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.




