Renigunta: బిస్మిల్లాహ్ నగర్ పార్కు దుస్థితిపై ఎంపీడీవో ఆగ్రహం!
Renigunta: రేణిగుంట పట్టణంలోని బిస్మిల్లాహ్ నగర్ పార్కు దుస్థితిపై ఎంపీడీవో రవిచంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Renigunta: బిస్మిల్లాహ్ నగర్ పార్కు దుస్థితిపై ఎంపీడీవో ఆగ్రహం!
Renigunta: రేణిగుంట పట్టణంలోని బిస్మిల్లాహ్ నగర్ పార్కును శుక్రవారం ఎంపీడీవో రవిచంద్ర,టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషాతో కలిసి సందర్శించి పార్కు పరిస్థితులను పరిశీలించారు. పార్కు అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు మౌలిక సదుపాయాల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పార్కును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పార్కులో నడక మార్గాలు, చిన్నారుల ఆట పరికరాలు, బెంచీలు, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ఆకర్షణీయమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజలు కుటుంబ సభ్యులతో వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా అవసరమైన అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఈవో శ్రీధర్,వీఆర్వో భాస్కర్,వెంకటేష్,సుబ్బరాయుడు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.




