sullurpeta: మహిళా శక్తికి నిలువెత్తు రూపం సూళ్ళూరుపేట ఎమ్మెల్యే!

sullurpeta: సూళ్ళూరుపేట ఎంపిడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రజాదర్బార్ నిర్వహించి 45 అర్జీలను స్వీకరించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 7 Aug 2026 5:22 PM IST
sullurpeta
X

sullurpeta: మహిళా శక్తికి నిలువెత్తు రూపం సూళ్ళూరుపేట ఎమ్మెల్యే!

Sullurpeta: రాజకీయాల్లో మహిళలు రాణించడం సులువేమీ కాదు. కానీ, అంకితభావం, పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ నిరూపిస్తున్నారు. నియోజకవర్గంలో సమస్య ఏదైనా సరే నా వద్దకు వచ్చిన ప్రజలకు న్యాయం జరగాల్సిందే అనే ధ్యేయంతో ఆమె ముందుకు సాగుతున్నారు. శారీరక అలసటను పక్కనపెట్టి నిత్యం ప్రజల మధ్యే గడుపుతూ అందరి అభినందనలు పొందుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట ఎంపిడీవో కార్యాలయ ఆవరణలోని CVAP యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.

నెలవల విజయశ్రీ నేతృత్వంలో 'ప్రజా దర్బార్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 45 అర్జీలను ఆమె స్వయంగా స్వీకరించారు. ప్రజలు తమ బాధలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటిని ఎంతో ఓపికగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ బాధ్యతలను మోయడం సామాన్యమైన విషయం కాదు. రోజుకి రెండు మూడు కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా, నిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమవుతున్నారు మాట్లాడే విధానంలో గానీ, సమస్యలను వినే శ్రద్ధలో గానీ ఆమె ఏమాత్రం తగ్గడం లేదు. "మహిళలు మనస్ఫూర్తిగా కష్టపడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి" అని తన పనితీరుతో నిరూపిస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పర్యటిస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారిని కలిస్తే పరిష్కారం లభిస్తుందనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడంలో ఆమె ముందంజలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ఆమె వైఖరిపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story