Kothapalem: స్వచ్ఛమైన తాగునీటి దిశగా ముందడుగు.. ఐడీఏ సంస్థల చేయూత
Kothapalem: రేణిగుంట మండలం కొత్తపాలెంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
Kothapalem: స్వచ్ఛమైన తాగునీటి దిశగా ముందడుగు.. ఐడీఏ సంస్థల చేయూత
Kothapalem: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎలమంద్యం పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావిస్తూ, గ్రామస్తులందరికీ స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు గజులమండ్యం ఐడిఏలోని మల్లాది డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సంస్థ తమ సీఎస్సార్ నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందించింది.
ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా,క్లస్టర్ ఇంచార్జి పుషనాధం, మేరీ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




