Srikalahasti: శ్రీకాళహస్తిలో ఆగస్టు 2న మెగా మెడికల్ క్యాంపు!

Srikalahasti: జడ్పీ బాయ్స్ పాఠశాలలో ఆగస్టు 2న నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంపును పోలీసులు, విలేకరులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ ఎన్.ఎస్. మూర్తి కోరారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 30 July 2026 1:49 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ఆగస్టు 2న మెగా మెడికల్ క్యాంపు!

Srikalahasti: ఆగస్టు రెండో తేదీన శ్రీకాళహస్తిలోని ఆర్ పి జడ్పీ బాయ్స్ స్కూల్ నందు నిర్వహించే మెగా మెడికల్ క్యాంపును విజయవంతం చేయమని శ్రీ కాళహస్తి డిఎస్పి ఎన్ఎస్ మూర్తి పత్రిక పూర్వకంగా తెలియజేశారు .

ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ

ఆగస్టు రెండవ తేదీన శ్రీకాళహస్తిలోని ఆర్పిబిఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు డిఎన్ఆర్ హాస్పిటల్స్ సిబ్బందిచే నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంపును శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద వెలసిన హజరత్ జుoలెషావలి పీర్ దర్గా ఉరుష్ కమిటీ చైర్మన్ ఓరుగంటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుందని,

ఈ మెడికల్ క్యాంపు నందు పోలీసులు మరియు విలేకరులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన ఔషధాలను ఉచితంగా అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టి ఉన్నారని ,కాబట్టి ఈ అవకాశాన్ని పోలీసులు మరియు ప్రెస్ సిబ్బంది సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అని తెలియజేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story