Kodur: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం మూడు వాహనాలు అగ్నికి ఆహుతి
Kodur: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లి చెక్‌పోస్టు వద్ద లారీ, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Kodur: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం మూడు వాహనాలు అగ్నికి ఆహుతి
కోడూరు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లి చెక్‌పోస్టు సమీపంలో సోమవారం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొనగా, వెంటనే మరో కారు వచ్చి ఆ కారును ఢీకొట్టింది. దీంతో మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి.
ప్రమాదం అనంతరం వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




