Tirupati: తిరుపతిలో దొరికిన కడప జైలు పరారీ ఖైదీ!
Tirupati: కడప సెంట్రల్ జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ వీరారెడ్డిని తిరుపతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులకు అతన్ని అప్పగించిన వైనం పూర్తి వివరాలు.
Tirupati: తిరుపతిలో దొరికిన కడప జైలు పరారీ ఖైదీ!
Tirupati: కడప సెంట్రల్ జైలు నుంచి బుధవారం ఖైదీ పరార్ ఆయన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో రిమాండ్ లో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డి కడప సెంట్రల్ జైలులో ఖైదీ గా బందీగా ఉన్నారు. మరో దొంగతనం కేసుకు సంబంధించి PT వారెంట్ తో రాయచోటికి తీసుకొచ్చి విచారణ అనంతరం తిరిగి వీరారెడ్డిని రాయచోటి కోర్టులో హాజరుపరిచి తిరిగి కడప సబ్ జైలు వద్దకు తరలిస్తుండగా
జైలు లోపలికి వెళ్లే క్రమంలో తప్పించుకొని పారిపోయిన వీరారెడ్డి. తిరుపతికి చేరుకున్న వీరారెడ్డి ని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకొని రాయిచోటి పోలీసులకు సమాచారం అందించారు. రిమాండ్ ఖైదీ వీరారెడ్డిని రాయచోటికి చెందిన ఏఎస్ఐ చంద్రశేఖర్ కానిస్టేబుల్ అయాన్ భాష హోంగార్డు మధు బాబుకు పోలీసులు అప్పగించడంతో రాయచోటికి తీసుకెళ్లిన పోలీసులు.




