Tirupati: చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం!
Tirupati: తిరుపతి పీఎల్‌ఆర్ కళ్యాణమండపంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన పెద్దిరెడ్డి, భూమన, రోజా, పూతలపట్టు ఇన్‌చార్జ్.
Tirupati: చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం!
Tirupati: తిరుపతి పీఎల్‌ఆర్ కళ్యాణమండపంలో ఆదివారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో రీజనల్ కోఆర్డినెటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్ కె రోజా, నారాయణస్వామిలతో పాటు అన్ని నియోజక వర్గాల ఇన్ చార్జిలతో పాటు పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారి చేతుల మీదుగా పార్టీ గుర్తింపు కార్డును డాక్టర్ సునీల్ కుమార్ అందుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. జగనన్న నాయకత్వంలో ప్రతి నాయకుడు, కార్యకర్తను సమన్వయం చేసుకుని ఎన్నికల్లో పోరాటం చేస్తామని డాక్టర్! ఎం సునీల్ కుమార్ స్పష్టం చేశారు.




