Renigunta: డీఎస్సీపై వైసీపీ డ్రామాలు.. జనసేన నాయకుడు మిథున్ శాలి ఫైర్!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో వైసీపీ ధర్నాలపై జనసేన నాయకుడు మిథున్ శాలి మండిపడ్డారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 11 Aug 2026 5:10 PM IST
Renigunta
X

Renigunta: డీఎస్సీపై వైసీపీ డ్రామాలు.. జనసేన నాయకుడు మిథున్ శాలి ఫైర్!

రేణిగుంట: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ధర్నాలపై జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకుడు మిథున్ శాలి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రేణిగుంటలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు.

డీఎస్సీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ, వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు,ఆందోళనలు చేస్తున్నారని మిథున్ శాలి విమర్శించారు.గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు ఆందోళనలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని,డీఎస్సీ నియామక ప్రక్రియపై అభ్యర్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులు,నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలను మానుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story