Renigunta: గిరిజన గురుకుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్తా: మిథున్!
Renigunta: రేణిగుంట గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న జనసేన నాయకుడు మిథున్ శాలి.
Renigunta: గిరిజన గురుకుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్తా: మిథున్!
రేణిగుంట: రేణిగుంట మండలంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను జనసేన నాయకుడు మిథున్ శాలి బుధవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ప్రిన్సిపాల్‌తో సమావేశమై సిబ్బంది కొరత, వంటశాల పనులు విద్యార్థులతో చేయిస్తున్నారనే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.వంట మాస్టర్, వంట మాస్టర్ సహాయకులు, శుభ్రత సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పారిశుద్ధ్యం,మరుగుదొడ్లు,డ్రైనేజీ, అంతర్గత రహదారుల సమస్యలపై కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు.అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించి, భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.గిరిజన గురుకుల పాఠశాలల సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మిథున్ శాలి తెలిపారు.




