Naidupeta: ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం' – బూత్ నంబర్ 71లో పూర్తి!
Naidupeta: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశాల మేరకు నాయుడుపేట బూత్ నంబర్ 71లో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు విజయవంతంగా పూర్తి చేశారు.
Naidupeta: ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం' – బూత్ నంబర్ 71లో పూర్తి!
నాయుడుపేట: నాయుడుపేట సూళ్లూరుపేటశాసనసభ్యురాలు నెలవల విజయ్ శ్రీ ఆదేశాల మేరకు ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బూత్ నంబర్ 71 లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమమును పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పలుకూరు ముత్యాలు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సంతోషకరంగా ఉందని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం ప్రజల నుంచి వారి సమస్యలను తెలుసుకొని అధి నాయకులకు తెలియజేయడం నాయకులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అభినందించిన దిగిన విషయమని తెలుగుదేశం పార్టీ నాయకులు పలుకూరు ముత్యాలయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 836 ఓట్లు కలిగిన బూత్ నంబర్ 71 లో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమమును పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే విజయ శ్రీ ఇన్చార్జి నెలల సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో దిగ్విజయంగా ఈ కార్యక్రమము ను పూర్తి చేయడం సంతోషంగా ఉందని కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ధిలోనూ ముందుకెళ్లడం ప్రజలే చూస్తున్నారని కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో రెండేళ్లు పూర్తి చేసుకున్నందుకు అటు ప్రజలు ఇటు నాయకులు అభినందనలు తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.




