Srikalahasti: భాష్యం స్కూల్ యోగా వేడుకల్లో మెరిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు
Srikalahasti: శ్రీకాళహస్తిలోని భాష్యం ఈఎం స్కూల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Srikalahasti: భాష్యం స్కూల్ యోగా వేడుకల్లో మెరిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు
శ్రీకాళహస్తి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని భాష్యం ఈఎం స్కూల్‌లో శనివారం ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా నిపుణుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించి యోగా ప్రాముఖ్యతను వివరించారు.
యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో అందరూ పాల్గొని యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు




