Puttur: పుత్తూరు ద్రౌపతమ్మ తిరునాళ్లకు భారీ పోలీస్ బందోబస్తు!

Puttur: తిరుపతి జిల్లా పుత్తూరు శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, తిరునాళ్ల సందర్భంగా డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 21 Aug 2026 8:19 PM IST
Puttur
X

Puttur: పుత్తూరు ద్రౌపతమ్మ తిరునాళ్లకు భారీ పోలీస్ బందోబస్తు!

పుత్తూరు: పుత్తూరు మున్సిపాలిటీలో జరుగుతున్న శ్రీ ద్రౌపతి దేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం పుత్తూరు సబ్ డివిజన్ డీస్పీ పోలీసులకు &సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా అమ్మవారి తిరునాళ్లకు భక్తులు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ డీస్పీ మాట్లాడుతూ ద్రౌపతి దేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో యువకులు పరుగులు తీయడం, ఒకరినొకరు తోసుకోవడం, మహిళలతో అసభ్యంగా ఈలలు వేయడం, పెద్దగా అరవడం, బూరలు ఊదడం వంటి వాటికీ మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు, యువత భక్తులు పోలీసులకు సహకరించి తిరునాళ్లను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story