Srikalahasti: ఇంటర్ ఫలితాల్లో శ్రీకాళహస్తి విద్యార్థి ప్రభంజనం!
Srikalahasti: శ్రీకాళహస్తి సమీపంలోని బీపీ అగ్రహారానికి చెందిన విద్యార్థి సీ.ఏ. హర్షవర్ధన్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు.
Srikalahasti: ఇంటర్ ఫలితాల్లో శ్రీకాళహస్తి విద్యార్థి ప్రభంజనం!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి సమీపంలోని బీపీ అగ్రహారానికి చెందిన విద్యార్థి సీ.ఏ. హర్షవర్ధన్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించి విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి హర్షవర్ధన్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సీ.ఏ. హర్షవర్ధన్ రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించడం విద్యార్థులకు ఆదర్శమని తలపా దామోదరం రెడ్డి అన్నారు. కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. హర్షవర్ధన్ తన కుటుంబానికి, చదువుకున్న విద్యాసంస్థకు మంచి పేరు తీసుకొచ్చాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.




