Renigunta: గంగమ్మ జాతరలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పూజలు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో జరుగుతున్న గంగమ్మ జాతరలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 19 Aug 2026 7:43 PM IST
Renigunta
X

Renigunta: గంగమ్మ జాతరలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పూజలు!

రేణిగుంట: పట్టణంలో వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరలో పాల్గొన్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, జిల్లా నాయకులు బీడీ బాలాజీ, మెలగరం సుబ్రహ్మణ్యం రెడ్డి, కూరకాల్వ వేణు, ప్రేమ్ రెడ్డి, రాజారాయల్, నరేష్ రాయల్, వేణుగోపాల్, శ్రీకాంత్, అశోక్ తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story