Erpedu: ఏర్పేడులో వరుస గొలుసు దొంగతనాల గుట్టురట్టు: ఇద్దరి అరెస్ట్!
Erpedu: ఏర్పేడులో వరుస గొలుసు దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు. ఇద్దరు నిందితుల అరెస్ట్, రూ. 10.21 లక్షల విలువైన బంగారం, KTM బైక్ స్వాధీనం.
Erpedu: ఏర్పేడులో వరుస గొలుసు దొంగతనాల గుట్టురట్టు: ఇద్దరి అరెస్ట్!
Erpedu: తిరుపతి జిల్లా ఏర్పేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2024, 2025, 2026 సంవత్సరాల్లో జరిగిన వరుస గొలుసు దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఐదు కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 75 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరాలకు ఉపయోగించిన KTM డ్యూక్ 250 మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఏర్పేడు మండలం కోబాక ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద యానాది విక్టర్ విజయ్ రాజ్ (22), యానాది డేవిడ్ కుమార్ (19)లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.10.21 లక్షలుగా పోలీసులు తెలిపారు.
విచారణలో నిందితులు మద్యపానం, జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఐదు కేసులను ఛేదించి 67 గ్రాముల బంగారు ఆభరణాలను సంబంధిత కేసుల్లో రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ క్రైమ్స్ ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో, రేణిగుంట SDPO వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఏర్పేడు CI బి. శ్రీకాంత్ రెడ్డి, ఎస్‌ఐలు ఎన్. శ్రీకాంత్ రెడ్డి, టి. ఇమామ్ హుస్సైన్ బాబా, ASI ధర్మసింగ్, పోలీస్ సిబ్బంది అరుణ్ కుమార్, మునేంద్ర బాబు, నమోరంగ ఈ దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు.
మహిళలు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేయాలని కోరారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భంగం కలిగించే నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు. గొలుసు దొంగతనాల కేసులను సమర్థవంతంగా ఛేదించిన ఏర్పేడు పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు.




