Railway Koduru: రైల్వే కోడూరులో వృద్ధురాలి దారుణ హత్య!

Railway Koduru: రైల్వే కోడూరు వినాయక నగర్‌లో 70 ఏళ్ల వృద్ధురాలు మంగమ్మ దారుణ హత్యకు గురయ్యారు. ఒంటిపై నగలు మాయం కావడంతో దోపిడీ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PRASAD, KODURU
Published on: 8 Sept 2026 3:30 PM IST
Railway Koduru
X

Railway Koduru: రైల్వే కోడూరులో వృద్ధురాలి దారుణ హత్య!

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరులోని వినాయక నగర్‌లో 70 ఏళ్ల రాజుపాలెం మంగమ్మ అనే వృద్ధురాలు రాత్రి వేళ అనుమానాస్పద స్థితిలో మృతి.

కడప జిల్లా పులివెందులకు చెందిన మంగమ్మ, తన భర్త కృష్ణ మరణించిన తర్వాత ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం కోడూరు వచ్చారు. కుమార్తెకు పెళ్లి చేసి, ఆమె వద్దనే వినాయక నగర్‌లో నివసిస్తున్నారు.

మంగమ్మ నివాసం ఉండే ఇంటికి పక్క సందులో తీవ్ర గాయాలతో నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సాధారణంగా ఆమె ఒంటిపై నగలు ఉండేవి. కానీ, ఇప్పుడు మృతదేహంపై నగలు లేకపోవడం మరియు శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో దోపిడీ కోసం హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, ఇది హత్యేనా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

PRASAD, KODURU

PRASAD, KODURU

Next Story