Renigunta: కోర్టు వినూత్న తీర్పు.. తాగుబోతు డ్రైవర్‌కు సమాజ సేవ శిక్ష!

Renigunta: మద్యం సేవించి ఆటో నడిపిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి కోర్టు వినూత్న శిక్ష విధించింది. రూ.10 వేల జరిమానాతో పాటు రేణిగుంట పోలీస్ స్టేషన్ క్లీన్

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 30 Jun 2026 2:50 PM IST
Renigunta
X

Renigunta: కోర్టు వినూత్న తీర్పు.. తాగుబోతు డ్రైవర్‌కు సమాజ సేవ శిక్ష!

రేణిగుంట: మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు వినూత్న శిక్షలు కూడా తప్పవని తిరుపతి కోర్టు స్పష్టం చేసింది.మద్యం మత్తులో ఆటో రిక్షా నడిపిన ఓ నిందితుడికి రూ.10,000 జరిమానాతో పాటు, రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయాలంటూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది,

వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలం,పైడికాలువ గ్రామానికి చెందిన జి. చంద్రశేఖర్ వయస్సు 38 అనే వ్యక్తి మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 కింద మద్యం సేవించి ఆటో నడిపినట్లు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు పెట్టీ కేసునం.336/2026, STC నం. 2038/2026 .

ఈ కేసును విచారించిన తిరుపతి II స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు,నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ శిక్షను ఖరారు చేసింది.

భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 23 ప్రకారం నిందితుడికి సమాజ సేవ విధించ బడింది. ఇందులో భాగంగా నిందితుడు రెండు రోజుల పాటు రేణిగుంట పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరచాల్సి ఉంటుంది.

పర్యవేక్షణ..ఈ సేవ నిర్వహించే సమయంలో రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర జారీ చేసే సూచనలను నిందితుడు తప్పనిసరిగా పాటించాలి.

ఈ సమాజ సేవ పూర్తయినట్లు నిర్ధారించే ఫోటోలతో కూడిన అనుసరణ నివేదికను జూలై 02, 2026 ఉదయం 10:30 గంటలలోపు కోర్టుకు సమర్పించాలని రేణిగుంట స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

ఒకవేళ కోర్టు ఆదేశాలను నిందితుడు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని న్యాయమూర్తి హెచ్చరించారు

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story