Tirupati: దొరవారిసత్రంలో ఓటర్లకు నోటీసులు. నిర్లక్ష్యం చేస్తే ఓటు కట్!

Tirupati: తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో అందుబాటులో లేని ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. ఓటు పోకుండా సచివాలయం లేదా తహసీల్దార్‌ను కలవాలని తహసీల్దార్ సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Aug 2026 11:32 AM IST
Tirupati
X

Tirupati: దొరవారిసత్రంలో ఓటర్లకు నోటీసులు. నిర్లక్ష్యం చేస్తే ఓటు కట్!

దొరవారి సత్రం మండలంలో ఓటర్లకు నోటీసులు పంపిణీ

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం లో సర్ ప్రోగ్రాం కు సంబంధించి అందుబాటులో లేని ఓటర్లకు మరియు మ్యాపింగ్ లో లేని ఓటర్లకు నోటీసులు పంపిణీ చేయడం జరుగుతుందని దొరవారిసత్రం మండలంలో సర్ ప్రోగ్రాంకు అందుబాటులో లేని మరియు మ్యాపింగ్ లో లేని వాటర్ లో 1800 నుండి 2000 వరకు ఉన్నారని వారికి ఈ నోటీసులను అందించడం అందుబాటులో లేని వారి ఇంటికి నోటీసులను అంటించడం జరుగుతుందని తాసిల్దార్ రాజేంద్ర ఈ సందర్భంగా తెలియజేశారు,

నోటీసులు అందుకున్న ఓటర్లు ఓటును ఈ మండలంలో లేదా వారికి సంబంధించిన పంచాయతీలలో కావాలి అనుకుంటే మరల వారు ఓటు పొందే అవకాశం కల్పిస్తామని లేకుంటే ఓటును శాశ్వతంగా తొలగించడం జరుగుతుందని అందువలన మండలంలోని ప్రజలు నోటీసులు అందుకున్న వెంటనే స్పందించి తాసిల్దార్ కార్యాలయమునకు గాని లేదా సచివాలయాలకు గాని వివరాలను అందజేస్తే వారికి కచ్చితంగా ఓటును అందజేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ వినియోగించుకొని వారి ఓటు హక్కును పొందాలని తాసిల్దార్ రాజేంద్ర అన్నారు, ఈరోజు నుండి ఓటర్లకు నోటీసులను పంపిణీ చేయడం జరుగుతుంది, నోటీసులు అందుకున్న వారు మరి స్పందనను కచ్చితంగా అధికారులకు తెలియపరిచి వారి ఓటును వారి ఉన్న ప్రదేశంలో పొందాలని తాసిల్దార్ రాజేంద్ర తెలియపరిచారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story