Tiruchanur: వరలక్ష్మీ వ్రతం వేళ పద్మావతి అమ్మవారి భక్తులకు మట్టి గాజుల ప్రసాదం

Tiruchanur: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారికి భక్తులు 4500 డజన్ల మట్టి గాజులను వితరణగా అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 19 Aug 2026 3:56 PM IST
Tiruchanur
X

Tiruchanur: వరలక్ష్మీ వ్రతం వేళ పద్మావతి అమ్మవారి భక్తులకు మట్టి గాజుల ప్రసాదం

తిరుచానూరు: వరలక్ష్మీవ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి తిరుపతికి చెందిన రవి, లోకనాథం 4500 డజన్లు మట్టి గాజులు బుధవారం ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ కు అందజేశారు.

వీటిని వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు గాజులు అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయల్, సురేష్ అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story