Tirupati: పీఎం శ్రీ స్కూల్‌లో 21 అంశాల పక్కా పరిశీలన ప్రమాణాలపై డీఈఓ!
Tirupati: విద్యాశాఖాధికారి (DEO) కె.వి.ఎన్. కుమార్ తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (ZPHS) అకస్మాత్తుగా తనిఖీ చేసి, విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
Tirupati: పీఎం శ్రీ స్కూల్‌లో 21 అంశాల పక్కా పరిశీలన ప్రమాణాలపై డీఈఓ!
తిరుపతి: రూరల్ (మండలం) జిల్లా విద్యాశాఖ అధికారి కె వి ఎన్ కుమార్ తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఒకేషనల్ కోర్సులు ఐటి, ఆటోమోటివ్, బ్యూటీ అండ్ వెల్నెస్, పాల్ ల్యాబ్, కార్యాలయం నిర్వహణ, మౌలిక సదుపాయాలు, కిచెన్ గార్డెన్, ప్లే ఫీల్డ్, మాస్ డ్రిల్, లైబ్రరీ, క్రీడా పరికరాలు, సౌర విద్యుత్ ఫలకాలను, పాఠశాల క్రీడా మైదానము, స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, పరిశుభ్రత, పీ.ఎం. శ్రీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయినా ఇరవై ఒక్క అంశాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు.
సందర్శన అనంతరము పాఠశాలలో కొనసాగుతున్న విద్యా ప్రమాణాలు, సదుపాయాలు మరియు నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు ఇదేవిధంగా కృషి చేయాలని సూచించారు.
7 వ తరగతి విద్యార్థులతో తరగతి గదిలో ముఖాముఖిగా మాట్లా డి సంతృప్తిని వ్యక్తం పరిచారు. పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి కె వి ఎన్ కుమార్ ప్రసంశించినారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల కృషిని ఇదేవిధంగా కొనసాగించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. మురళి, ఏ.ఎమ్.ఓ. చంద్రశేఖర్ నాయుడు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఎస్. వెంకట ముని, వాసు, లీలా ప్రతాప్ , భూపాల్, వెంకటాచలపతి, ముని నాగరాజు, స్కౌట్స్ అండ్ గైడ్స్, హిమ బిందు, భవాని, వెంకటరత్నం, గోపాలకృష్ణ, హిమాచలం, లక్ష్మి, తేజోవతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.




