Sullurupeta: తాళం వేసిన ఇంట్లో చోరీ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!
Sullurupeta: సూళ్ళూరుపేటలో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు, నిందితుడు చందును అరెస్ట్ చేసి అతని నుంచి రూ. 5 లక్షల విలువైన 40 గ్రాముల బంగార స్వాధీనం.
Sullurupeta: తాళం వేసిన ఇంట్లో చోరీ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో ఇటీవల కలకలం రేపిన పగటి దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ G. చెంచుబాబు, సూళ్ళురుపేట సీఐ ఎం. మురళీ కృష్ణ పర్యవేక్షణలో సూళ్ళురుపేట ఎస్ఐ G. అజయ్ కుమార్ సీ.సుబ్రహ్మణ్యం రాజు , మరియు వారి సిబ్బంది కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ నెల 1వ తేదీన సూళ్ళురుపేట టౌన్, నాగరాజపురం వద్ద నివాసముంటున్న అపాచీ కార్మికురాలు కత్తి సునీత ఇంటి తాళాలు, బీరువా లాకర్లు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సూళ్ళూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
హోలీ క్రాస్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్దపొడుగుపాడు గ్రామానికి చెందిన 24 ఏళ్ల చలంచర్ల చందును అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడి వద్ద నుండి ఐదు లక్షల రూపాయల విలువైన 40 గ్రాముల (5 సవర్లు) బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
పట్టణంలో దొంగతనాల అడ్డుకట్టకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేసును వేగంగా ఛేదించి, రికవరీ సాధించిన ఎస్ఐ గంటా. అజయ్ కుమార్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, డిఎస్పీ జీ. చెంచుబాబు, సీఐ ఎం. మురళీ కృష్ణ అభినందించారు.




