Renigunta: రెయిన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్‌లో ఎస్‌పీఎల్ ఎన్నికలు ఉత్సాహభరితం
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని రెయిన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్‌లో ఎస్‌పీఎల్ (SPL) ఎన్నికలు–2026 అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి.
Renigunta: రెయిన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్‌లో ఎస్‌పీఎల్ ఎన్నికలు ఉత్సాహభరితం
రేణిగుంట: రేణిగుంటలోని రెయిన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్‌లో ఎస్‌పీఎల్ (స్టూడెంట్ ప్యూపిల్ లీడర్) ఎన్నికలు–2026 ఉత్సాహభరితంగా నిర్వహించారు.నిజమైన ఎన్నికల తరహాలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో అనుభవించారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ పత్రాలు,బ్యాలెట్ బాక్సుల ద్వారా విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అలాగే ఓటు వేసిన అనంతరం ఎన్నికల్లో పాటించే విధంగా విద్యార్థుల వేళ్లపై చెరగని సిరా (ఇండెలిబుల్ ఇంక్) గుర్తు వేయడం ద్వారా ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు,బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,నిష్పక్షపాత ధోరణి, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఎన్నికల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రమశిక్షణ,ఉత్సాహం, క్రీడా స్ఫూర్తి అందరినీ ఆకట్టుకున్నాయి.ఎన్నికల ఫలితాలను త్వరలోనే ప్రకటించి నూతన విద్యార్థి నాయకత్వ బృందాన్ని పరిచయం చేయనున్నట్లు రెయిన్‌బో విద్యాసంస్థ కరెస్పాండంట్ అత్తాఉల్లా ఖాన్ వెల్లడించారు.




