Gudur: మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలి: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల డిమాండ్!
Gudur: తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు.
Gudur: మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలి: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల డిమాండ్!
గూడూరు: గత నెల 21వ తేదీ నుండి పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం భోజన విరామ సమయంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ళుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. విధులకు ఆటంకం లేకుండా తమ డిమాండ్లను భోజన విరామ సమయంలో వ్యక్తం చేస్తున్నామన్నారు. గత 20 ఏళ్ళుగా చాలీ చాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
వంద శాతం గ్రాస్ వేతనం అమలు చేయాలని తెలిపారు. కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,కాంట్రాక్ట్ వ్యవస్దను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.




