Tirupati: త్రివర్ణ విద్యుత్ కాంతులతో మెరిసిపోయిన తిరుపతి కలెక్టరేట్!
Tirupati: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ భవనం త్రివర్ణ విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పండుగ వాతావరణం.
Tirupati: త్రివర్ణ విద్యుత్ కాంతులతో మెరిసిపోయిన తిరుపతి కలెక్టరేట్!
తిరుపతి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం త్రివర్ణ విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్ భవనాన్ని జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ విద్యుత్ దీపాలతో అలంకరించారు.
సాయంత్రం వేళ త్రివర్ణ కాంతులతో కలెక్టరేట్ భవనం మెరిసిపోవడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సైతం విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Next Story




