Tirupati: గ్రద్దగుంట సచివాలయంలో 'సర్' కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్!
Tirupati: తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్దగుంట సచివాలయంలో 'సర్' ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తనిఖీ చేశారు.
Tirupati: గ్రద్దగుంట సచివాలయంలో 'సర్' కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్!
తిరుపతి: తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామ సచివాలయంలో సర్ ప్రోగ్రాం ను పరిశీలన ప్రక్రియ కార్యక్రమం ను ఈరోజు మధ్యాహ్నం పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పరిశీలించడం జరిగింది.
ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సర్ ప్రోగ్రాం తిరుపతి జిల్లాలోనీ నియోజకవర్గాలలో సూళ్లూరుపేట నియోజకవర్గం మద్దతు స్థానంలో నిలవడం అందరికీ తెలిసిన విషయమే ఈ సర్ ప్రోగ్రాం లో ఇప్పుడు జరుగుతున్న పరిశీలన ప్రక్రియ కార్యక్రమాలను అధికారులు నడుపుతున్న తీరును ప్రజలకు ఓటు హక్కును అందిస్తున్న పరిస్థితులను పరిశీలించడానికి కలెక్టర్ వెంకటేశ్వర్ ఒజిలి మండలం గ్రద్దగుంట సచివాలయంలో అధికారులతో మాట్లాడడం జరిగింది.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును ఎట్టి పరిస్థితులలో కల్పించాలని ఏ ఒక్క ఓటు కూడా అర్హులకు అందుబాటులో లేకుండా ఉండకూడదని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు తెలియజేయడం జరిగింది.
తిరుపతి జిల్లా లో గల నియోజకవర్గాలలో సూళ్లూరుపేట నియోజకవర్గం ఇప్పటికే సర్ ప్రోగ్రాం లో అందుబాటులో లేని ఓటర్లకు నోటీసులను అందజేయడం జరిగిందని అందులో భాగంగానే ఓటర్ల పరిశీలన ప్రక్రియ కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడకు విచ్చేసిన ఓటర్లకు ఓటు హక్కు భరోసాను కల్పిస్తూ వెంటనే ఓటును కల్పించడం జరుగుతుందని.
ఓటర్లు నమోదు కార్యక్రమంలో లేకపోతే అధైర్య పడాల్సిన అవసరం ఏమీ లేదని ఈ కార్యక్రమం తో ప్రజలు వారి వారి ప్రాంతాలలో జరుగుతున్న సర్ కార్యక్రమంలో ఈ నోటీసులను ఆధార్ కార్డును లేదా వారికి సంబంధిత పత్రాలను తీసుకొని వెళితే ఓటు హక్కును కల్పించడం జరుగుతుందని ఓటరుకు ఏ ప్రాంతంలో ఓటు కావాలో కూడా నిర్ణయించుకునే అవకాశం ఈ సర్ ప్రోగ్రాం ద్వారా ఏర్పడుతుందని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలియజేయడం జరిగింది.




