Tirupati: తిరుపతి శిల్పారామం సందర్శించిన ఏపీ సీఈఓ వి.స్వామి నాయుడు
Tirupati: తిరుచానూరు శిల్పారామం ప్రాంగణాన్ని సీఈఓ వి స్వామి నాయుడు సందర్శించారు.
Tirupati: తిరుపతి శిల్పారామం సందర్శించిన ఏపీ సీఈఓ వి.స్వామి నాయుడు
తిరుపతి: తిరుపతి రూరల్, తిరుచానూరు శిల్పారామం ప్రాంగణాన్ని ఆయన గురువారం సందర్శించి, ప్రస్తుతం ఉన్న లాన్లను చక్కగా చేసినందుకు అక్కడి సిబ్బంది శిల్పారామం అధికారులును సీఈఓ వి. స్వామి నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా శిల్పారామం పరిపాలన అధికారి ఖాదర్ వల్లి అభివృద్ధి ప్రతిపాదనలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.
హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియంలోని బొమ్మల వివిధ మరమ్మతులు, పెయింటింగ్ పనులు, బోటింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, యాంఫీ థియేటర్ పక్కన ఉన్న టాయిలెట్ల ఆధునీకరణ తదితర అంశాలను తెలిపారు వీటిపై స్పందించిన సీఈఓ, సహాయం కోసం అవసరమైన అంచనాలను వెంటనే పంపాలని సూచించారు.
సీఈఓ జారీ చేసిన ముఖ్య ఆదేశాలు మెరుగైన లైటింగ్ పనిచేయని లైట్లను వెంటనే మరమ్మతు చేయించి రాత్రి వేళల్లో సందర్శకులకు ఇబ్బంది లేకుండా వెలుతురు ఉండేలా చూడాలి సురక్షిత బోటింగ్, ప్లే ఏరియా, చైల్డ్ ప్లే ఏరియా, బోటింగ్ విభాగాల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వాటికి తగిన అంచనాలు సిద్ధం చేయాలి.
కొత్త పచ్చిక బయళ్లు కొత్తగా లాన్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎస్టిమేట్స్ పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని సీఈఓ స్వామి నాయుడు తెలిపారు. దీని ద్వారా సందర్శకుల సంఖ్యను (ఫుట్‌ఫాల్స్) పెంచి, శిల్పారామం సుస్థిర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ శిల్పారామం అసిస్టెంట్ ఇంజనీర్ నందా, ఫీల్డ్ ఆఫీసర్ రాధాకృష్ణ, పప్పీ, శిల్పారామం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




