Srikalahasti: ఆలయ సమగ్ర అభివృద్ధిపై ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ సమీక్ష!

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ సమగ్ర అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం జరిగింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 18 July 2026 12:29 AM IST
Srikalahasti
X

Srikalahasti: ఆలయ సమగ్ర అభివృద్ధిపై ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ సమీక్ష!

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నిర్వహించిన సమగ్ర అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆలయ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తరహా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ఆలయానికి నేరుగా అనుసంధానం కల్పించే కనెక్టివిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి.కె. వెంకటేశులు, దేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి, తుడా సెక్రటరీ డా. ఎన్.వి. శ్రీకాంత్ బాబు, సీపీఓ దేవికుమారి, భూసేకరణ అధికారి సుజన, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, తుడా అధికారులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story