Nallapalem: నల్లపాలెంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ!

Nallapalem: రేణిగుంట మండలం నల్లపాలెంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను విజయవంతంగా పంపిణీ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 4 July 2026 10:47 AM IST
Nallapalem
X

Nallapalem: నల్లపాలెంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ!

నల్లపాలెం: రేణిగుంట మండల పరిధిలోని నల్లపాలెం గ్రామంలో శనివారం తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టాదారు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు.

రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story