Tirupati: విద్యుత్ బకాయిల వసూళ్లలో APSPDCL కఠిన చర్యలు!

Tirupati: విద్యుత్ బకాయిల వసూళ్లలో తిరుపతి APSPDCL అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రూ. 26.42 లక్షల బకాయిలపై గాజులమండ్యంలోని సంస్థకు ఆర్‌ఆర్ యాక్ట్ నోటీసు జారీ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 11 Aug 2026 8:01 PM IST
Tirupati
X

Tirupati: విద్యుత్ బకాయిల వసూళ్లలో APSPDCL కఠిన చర్యలు!

తిరుపతి: విద్యుత్ బకాయిల వసూళ్లలో భాగంగా APSPDCL తిరుపతి ఆపరేషన్ సర్కిల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గాజులమండ్యం ప్రాంతంలోని M/s Pioneer Alloy Castings Ltd. సంస్థ విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన రూ.26,42,460 బకాయిలు ఉండటంతో,బకాయిల వసూలు కోసం రెవిన్యూ రికవరీ యాక్ట్, 1864 కింద ఆస్తి రికవరీ నోటీసు జారీ చేశారు.

అంతేకాకుండా సంబంధిత ప్రదేశంలో ఆర్ ఆర్ యాక్ట్ యాక్టివ్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. నిర్ణీత గడువులో బకాయిలను చెల్లించకపోతే నిబంధనల ప్రకారం తదుపరి రెవెన్యూ రికవరీ చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ గంగాధర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ వి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ బకాయిలను సకాలంలో చెల్లించి, తదుపరి చర్యలు మరియు అసౌకర్యాలను నివారించుకోవాలని APSPDCL అధికారులు సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story